నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన రాజుకు సీఐ సన్మానం
రిపోర్టర్: శేఖర్
స్థలం: నర్సంపేట
నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న షాబర్తి రాజుకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ ఆయనను ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి పదోన్నతి పొందడం అభినందనీయమని సీఐ పేర్కొన్నారు. కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తోటి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.