సమాజ హితం కోసం స్వగృహాన్ని కూల్చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్
రిపోర్టర్: నరేష్
స్థలం: ఉజ్జయిన్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిన్లో సింహస్థ మహాకుంభమేళా ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పూర్వీకుల ఇల్లు కూల్చివేతకు గురైంది. స్వయంగా సీఎం మోహన్ యాదవ్ గునపం పట్టి ఈ పనులను ప్రారంభించారు. తన చిన్ననాటి ఇల్లు కూలిపోవడం వ్యక్తిగతంగా భావోద్వేగానికి గురిచేసిందని, కానీ సమాజ హితం, ప్రజాహితం కోసమే ఈ త్యాగం చేస్తున్నట్లు సీఎం మోహన్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆస్తులు కోల్పోతున్న ప్రజల్లో ధైర్యం నింపేందుకే తాను ముందుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు.