యూనివర్సిటీలో రూ.400 కోట్లు ఎలా వచ్చాయి?: సీఎం రేవంత్‌

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

మాజీ మంత్రికి చెందిన యూనివర్సిటీలో రూ.400 కోట్ల అక్రమ సంపాదన బయటపడిందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలొచ్చినా అధికారులను లోపలికి రానివ్వలేదన్నారు. దోచుకున్న ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. పాలు, పూలు అమ్మితే ఇంత డబ్బు వస్తుందా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.