యూపీలో అంబేద్కర్ విగ్రహాల ధ్వంసంపై అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Lucknow
ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ పాలనలో 72 జిల్లాల్లో 151 అంబేడ్కర్ విగ్రహాలు ధ్వంసమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లక్నోలో ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలో భాగంగానే ఉద్దేశపూర్వకంగా ఈ విధ్వంసకాండ జరిగిందని విమర్శించారు. కేవలం 14 కేసుల్లో మాత్రమే అరెస్టులు జరిగాయని, 84 కేసుల్లో ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆయన మండిపడ్డారు.