రూ.11,359 కోట్లతో పట్టణాభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇందులో 123 మున్సిపాలిటీల్లో రూ.7,469 కోట్లతో, గ్రేటర్ విశాఖ పరిధిలో రూ.3,890 కోట్ల వ్యయంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.