సినిమా విడుదల కోసం విద్యాసంస్థలకు సెలవు: మల్లారెడ్డి కాలేజీలపై విమర్శలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

సినిమా విడుదల రోజు మల్లారెడ్డి విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థల వైస్ ఛైర్మన్ ప్రీతి రెడ్డి ప్రకటించారని మల్లారెడ్డి విద్యాసంస్థల వర్గాలు వెల్లడించాయి. టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం చిత్రం ఈ నెల ముప్పైవ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు సెలవు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. అయితే చదువు చెప్పాల్సిన కాలేజీలు సినిమా కోసం హాలిడే ఇవ్వడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.