ఆమదాలవలసలో కుండపోత వర్షం వేళ అన్నదాతల్లో ఆనందం

రిపోర్టర్: Pydi. Suryanarayana స్థలం: ఆమదాలవలస

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఉదయం కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా రహదారుల్లో జనసంచారం తాత్కాలికంగా స్తంభించిపోయింది. రేపు వినాయక చవితి కావడంతో మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు కొంత అసౌకర్యం నెలకొన్నప్పటికీ, వరి మరియు కూరగాయల పంటలు సాగు చేస్తున్న రైతన్నలకు మాత్రం ఈ వర్షం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.