తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి హుండీ ఆదాయం రెండు కోట్ల తొంభై ఒక్క లక్షలు
రిపోర్టర్: రాము
స్థలం: తిరుమల
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తుల తాకిడి రోజురోజుకీ పెరుగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. సర్వదర్శనానికి దాదాపు 15 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజులో మొత్తం 67,632 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.91 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.