ఎయిర్ ఇండియా ప్రయాణికులకు రిఫండ్ కేవలం నాలుగు గంటల్లోనే!
రిపోర్టర్: రాజేష్
స్థలం: భారతదేశం
ఎయిర్ ఇండియా ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. టికెట్ రద్దు చేసుకున్న వారికి గతంలో రిఫండ్ అందడానికి 14 రోజుల వరకు సమయం పట్టేది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లను వినియోగిస్తూ ఈ ప్రక్రియను సంస్థ గణనీయంగా వేగవంతం చేసింది. ప్రస్తుతం ఈ వ్యవధిని కేవలం 4 గంటలకు తగ్గించినట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా వెల్లడించింది.