ప్రియదర్శి ఇడుపుకాయితం శ్రీలత పాట విడుదల తేదీ ఖరారు

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

ప్రియదర్శి హీరోగా వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ డ్రామా సినిమా 'ఇడుపుకాయితం'. తెలంగాణ మాండలికంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగదుర్గ హీరోయిన్. ఈ సినిమాలోని 'శ్రీలత..' పూర్తి పాటను ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ తొలివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.