కళాశాలల్ లో ఆన్లైన్ తరగతుల నిర్వహణ: ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలు, వృత్తి విద్యా కాలేజీల్ లో ఆన్లైన్ తరగతులు నిర్వహించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. నీటి కొరత నేపథ్యంలో పలు విద్యాసంస్థలు సెలవులు ప్రకటిస్తున్న తరుణంలో, వీసీలతో సమీక్ష నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు చేపడతామని వెల్లడించారు.