యాదగిరిగుట్టలో వైభవంగా సాగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణోత్సం

రిపోర్టర్: P.srinu స్థలం: భువనగిరి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామివారి నిత్య కళ్యాణోత్సం వైభవంగా జరిగింది. మహామండపంలో దేవుడిని కొత్త వస్త్రాలు, పూలతో అలంకరించి, వేద మంత్రాల మధ్య సుమారు రెండు గంటల పాటు కళ్యాణ తంతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.