రూ.2,000 లోపు యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
రూ.2,000 వరకు యూపీఐ మరియు రూపే డెబిట్ కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై బ్యాంకులు ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ జీరో ఛార్జీల విధానం కొనసాగుతుందని పునరుద్ఘాటించింది. అయితే రూ.2,000 దాటిన పెద్ద మొత్తాల లావాదేవీలపై స్పష్టత లేకపోవడంతో వినియోగదారుల్లో అయోమయం నెలకొంది.