ఎన్నికల సంఘం నిర్ణయంపై నిప్పులు: కేంద్ర ఎన్నికల కమిషనర్పై నిరసనల హోరు

రిపోర్టర్: హరి స్థలం: New Delhi

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరుపై ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు ఉధృతమయ్యాయని పీపుల్ ఎగైనెస్ట్ ఎస్ఐఆర్ వేదిక నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు, రైతులు చేపట్టిన ఈ మార్చ్ తీవ్ర కలకలం రేపిందని, ఈ అంశంపై ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయని వారు పేర్కొన్నారు.