ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ భారీ షాక్: స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్ ప్రకటన

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ వ్యాపార ప్రాధాన్యతలు, ఏఐ మార్పులకు అనుగుణంగా ఉద్యోగుల కోసం స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్ను ప్రకటించినట్లు కంపెనీ వెల్లడించింది. భారత్తో పాటు పలు దేశాల్లోని లెవెల్ 70 అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులను ఈ పథకం ద్వారా తొలగించకుండా స్వచ్ఛందంగా తప్పుకునే అవకాశమిచ్చారు. భారతీయ ఉద్యోగులు నిర్ణయం తీసుకోవడానికి డిసెంబర్ 1 వరకు గడువు ఇచ్చినట్లు కంపెనీ స్పష్టం చేసింది.