రాష్ట్రంలో వర్షాల కోసం: నగరి ఆలయంలో వరుణ యాగం నిర్వహణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నగరి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా నగిరిలో వరుణ యాగం నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాలు పడక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అన్ని ప్రధాన దేవాలయాలలో ఆగమశాస్త్రం ప్రకారం పండితులు ఈ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేద పండితులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.