తిరుమల తిరుపతి దేవస్థానం: స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
రిపోర్టర్: రమేష్
స్థలం: తిరుపతి
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. టీటీడీ పరిపాలన నిరంతరం సాగేందుకు వీలుగా స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ 658 జారీ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కమిటీకి టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర చైర్మన్గా వ్యవహరిస్తారని, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు సభ్యులుగా ఉంటారని అధికారులు స్పష్టం చేశారు.