కూకట్పల్లి లూలూ మాల్లో తీవ్ర కలకలం: చాక్లెట్లో పురుగులు ప్రత్యక్షం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని కూకట్పల్లి లూలూ మాల్లో ఓ కస్టమర్కు తీవ్ర చేదు అనుభవం ఎదురైందని బాధితుడు తెలిపారు. ఎంతో ఆశగా కొనుగోలు చేసిన కిట్ క్యాట్ చాక్లెట్ ప్యాకెట్ను ఓపెన్ చేయగా అందులో పురుగులు సంచరిస్తూ కనిపించడంతో కస్టమర్ దిగ్భ్రాంతికి గురయ్యాడని పేర్కొన్నారు. పండగ పూట ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మాల్ యాజమాన్యంపై తక్షణమే ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.