మహాకవి గురజాడ జయంతిని రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయనగరం

మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై విజయనగరం జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి ఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించనుంది. విజయనగరంలోని గురజాడ స్వగృహాన్ని పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు ఏర్పాట్లపై జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్.సత్తిబాబు అధికారులతో సమీక్షించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవతో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, కందుల దుర్గేష్ స్పందించి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సాహితీవేత్తలు, కవులు, గురజాడ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.