ఇళ్ల స్థలాల కోసం ఇందిరాపార్కు వద్ద కదంతొక్కిన జర్నలిస్టులు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద జేఎన్జే సొసైటీ సభ్యులు ధర్నా నిర్వహించారు. పేట్ బషీరాబాద్, నిజాంపేట్ లో కేటాయించిన స్థలాలను అప్పగించాలని డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ, జర్నలిస్టులకు ప్రత్యేక జీవో ద్వారా ఇళ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నాలో సొసైటీ అధ్యక్షుడు రమణారావు, సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు.