పెద్దగుట్ట వద్ద భారీగా మట్టి అక్రమ తరలింపు: ఆందోళనలో గ్రామస్తులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: తిమ్మాపూర్
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి రెవెన్యూ పరిధిలోని పెద్దగుట్ట వద్ద నిబంధనలకు విరుద్ధంగా రాత్రింబవళ్లు మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. నామమాత్రపు రుసుము చెల్లించి, అనుమతికి మించి వేల లారీలు తరలిస్తూ సహజ సంపదను కొల్లగొడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అక్రమార్కులకు సహకరిస్తున్నారని, వెంటనే సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.