మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు: సీబీఐ విచారణకు జగన్ డిమాండ్
రిపోర్టర్: సునీల్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీ మెగా డీఎస్సీలో నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని వైఎస్ జగన్ ఆరోపించారు. కర్నూలులో స్పోర్ట్స్ కోటా అక్రమాలపై మంత్రి నారా లోకేష్‌ను బాధ్యుడిని చేస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ నియామకాల్లోనూ అవకతవకలు జరిగాయని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.