నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరుకానున్న బీఆర్ఎస్ నేత కేటీఆర్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లో 2023లో నిర్వహించిన ఫార్ములా-ఈ కార్‌ రేస్ కోసం నిబంధనలు ఉల్లఘించి విదేశీ సంస్థకు నిధులు బదలాయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.54.88 కోట్ల భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందనే ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.