చెన్నైలో చికిత్స పొందుతూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ కన్నుమూత

రిపోర్టర్: సతీష్ స్థలం: తిరుపతి

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు ట్రస్టు ప్రతినిధులు ప్రకటించారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. భక్తుల సందర్శనార్థం పార్థివదేహాన్ని తిరుపతిలోని ఏకం ఆలయానికి తరలించారు. ఈ నెల శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎల్ఐసీ ఏజెంటుగా జీవితం ప్రారంభించిన ఆయన, ఆధ్యాత్మిక గురువుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.