ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
అమరావతిలో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక పూజలో పాల్గొన్నారు. జ్ఞానానికి, విజయానికి ప్రతీక అయిన గణపతి ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోవాలని కోరుకున్నారు. ఏపీ సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని భగవంతుడిని ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు.