ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన: నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో భాగంగా ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ఆయన అధికారికంగా ప్రారంభిస్తారు. అలాగే యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ పనులను పరిశీలించడంతో పాటు నియుమ్ క్యాంపస్ నిర్మాణానికి భూమిపూజ చేసి, మాస్టర్ ప్లాన్‌పై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని అధికారులు స్పష్టం చేశారు.