నిరుద్యోగుల కోసం రైల్వేకోడూరులో భారీ ఉద్యోగ మేళా నిర్వహణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రైల్వే కోడూరు

తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 28న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఏపీఎస్ఎస్డీసీ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ ఆధ్వర్యంలో సాయి నగర్లోని శ్రీ సాయి కళాశాలలో ఈ మేళా జరగనుంది. పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత ఉన్న 18 నుంచి 35 ఏళ్ల యువత హాజరుకావచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.