పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు బూత్ స్థాయి నుంచే ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గాంధీభవన్లో జరిగిన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సన్నద్ధత సమావేశంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. పట్టభద్రులంతా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు.