కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కలకలం: కిడ్నాప్ డ్రామా ఆడిన మహిళ అరెస్ట్
రిపోర్టర్: హరి
స్థలం: Kerala
కేరళలోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుండి బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ప్రియాంక అనే మహిళ కిడ్నాప్ డ్రామా ఆడిందని అధికారులు తెలిపారు. బంగారాన్ని కాజేసేందుకు ఆమె ప్లాన్ చేసి ఇద్దరు వ్యక్తులతో కారులో పరారవుతుండగా, పోలీసులు పన్నెండు కిలోమీటర్ల మేర ఛేజింగ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రియాంకతో పాటు సహకరించిన వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.