'అడ్వాన్స్ టిప్ విధానం అన్యాయం': క్యాబ్ కంపెనీలకు కేంద్రం సీరియస్ వార్నింగ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
రైడ్ బుక్ చేసుకునే ముందే డ్రైవర్‌కు టిప్ వసూలు చేసే అడ్వాన్స్ టిప్ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇది అన్యాయమైన వ్యాపార పద్ధతి అని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే స్పష్టం చేశారు. ప్రయాణం పూర్తయిన తర్వాత కస్టమర్ల ఇష్టపూర్వకంగా ఇచ్చేదానికే ప్రాధాన్యత ఉండాలని, ముందుగానే టిప్ బలవంతంగా వసూలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.