జైపూర్లో టూరిస్ట్ గైడ్ హత్యతో తీవ్ర ఉద్రిక్తత.
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Rajasthan
జైపూర్లోని అమేర్ కోట వద్ద జీపు ప్రవేశంపై జరిగిన వివాదంలో తీవ్రంగా గాయపడిన టూరిస్ట్ గైడ్ మనీష్ సోని చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో స్థానికులు షాపులు మూసివేసి పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులు అజమ్, నజీష్లను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.