'జాతీయ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత': రష్యా చమురు దిగుమతులపై భారత్ స్పష్టత

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై వంద శాతం సుంకాలు విధించేలా అమెరికా చట్టసభల్లో రూపొందించిన బిల్లుపై భారతదేశం గట్టిగా స్పందించింది. తమ దేశ ప్రజల ఇంధన భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రాథమిక బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఏ ఒక్క దేశంపైనో ఆధారపడకుండా విభిన్న వనరుల ద్వారా ఇంధనాన్ని సేకరించే వ్యూహాన్ని కొనసాగిస్తామని, దేశీయ ప్రయోజనాలే తమకు మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేసింది.