ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని పెంచిన ఏపీ ప్రభుత్వం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిఫాం సర్వీసులకు రెండేళ్లు సడలింపు ఇస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవోలు విడుదల చేసింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ పెంపు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.