రోడ్డు వేయమని నిలదీసిన యువకుడిని పోలీసులతో లాగించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

రిపోర్టర్: నరేష్ స్థలం: Telangana

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ధర్మన్నగూడ గ్రామంలో రోడ్ల నిర్మాణంపై ప్రశ్నించిన యువకుడిని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పోలీసులతో లాగిపారేయించినట్లు Telugu Scribe వెల్లడించారు. మూడేళ్లుగా రోడ్డు వేస్తానని హామీ ఇచ్చి విస్మరించడంతో పాటు అభివృద్ధిని నిలదీసినందుకు స్థానిక యువకుడిపై దాష్టీకానికి పాల్పడటం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలపై నిలదీసే వారి గొంతును అణచివేయడం సరికాదని బాధితులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.