తుపాను వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డు తో బక్కలగొందిలో స్తంభించిన రాకపోకలు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: ముంచింగిపుట్టు

అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం బక్కలగొంది గ్రామంలో అడవి తల్లి బాట ద్వారా నిర్మిస్తున్న దేవిన రోడ్డు కల్వర్టు సమీపంలో మురాసు తుపాన్ వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయింది. అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించి నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు.