చేబ్రోలు మండలంలో పల్లెపండుగ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: గుంటూరు
పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.2.81 కోట్ల వీబీ-గ్రామ్ నిధులు కేటాయించినట్లు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడించారు. చేబ్రోలు గ్రామంలోని పాతరెడ్డిపాలెం ప్రాంతంలో రూ.18 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను జనసేన పార్టీ సమన్వయకర్త వద్రానం బ్రహ్మం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగవుతాయని ఆయన పేర్కొన్నారు.