ఏపీఈఆర్సీ నూతన చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ నియామకం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నూతన చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అని ఇంధన శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర ఇంధన శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ రంగంలో పారదర్శకత, నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించే దిశగా ఆయనకు ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. ఐదేళ్ల పాటు లేదా డెబ్బై ఏళ్ల వయస్సు నిండే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.