శ్రీకాకుళం జిల్లాలో చైన్ స్నాచింగ్ కేసు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: రాజేష్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా మందస పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై కృష్ణ ప్రసాద్ తెలిపారు. గత నెల 28న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏ-1 చందన్ మహారాణా సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.