టెక్ ప్రియులకు గుడ్ న్యూస్: 7000mAh బ్యాటరీతో బెస్ట్ 5జీ ఫోన్లు
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల కోసం మార్కెట్ లో భారీ బ్యాటరీ సామర్థ్యంతో పలు నూతన మోడళ్లు అందుబాటులో ఉన్నాయని ప్రముఖ టెక్ నిపుణులు వెల్లడించారు. పదేపదే ఛార్జింగ్ పెట్టే సమస్యకు చెక్ పెట్టేలా ఏడు వేల మిలియంపియర్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ తో పాటు శక్తివంతమైన ప్రాసెసర్లు, అధునాతన కెమెరా ఫీచర్లతో వివో, మోటోరోలా, ఒప్పో అలాగే రియల్ మీ సంస్థలు మార్కెట్లోకి సరికొత్త అయిదు 5జీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయని టెక్ నిపుణులు తెలిపారు.