స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కోసం ముమ్మర కసరత్తు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా సవరణ పత్రాలను పరిశీలించారు. చౌటుప్పల్ ఉప తహసీల్దార్ ఎస్. సూరయ్య ఆధ్వర్యంలో, సర్పంచ్ సుర్వి మల్లేష్గౌడ్ సమీక్షలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో గతంలో 1,427 మంది ఓటర్లు ఉండగా, 94 మంది తొలగింపుతో ప్రస్తుతం 1,333 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండు ఎన్నికల బూత్ల పరిధిలో సవరణలు పూర్తి చేశారు.