పెదకాకాని ఆలయం వద్ద ఉద్రిక్తత: వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ

రిపోర్టర్: నరేష్ స్థలం: గుంటూరు

గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం చోరీ ఘటనపై రాజకీయ రగడ మొదలైంది. కొత్త మంగళసూత్రం సమర్పించేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేత అంబటి మురళిని టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆలయ పాలకమండలిపై అంబటి తీవ్ర విమర్శలు చేయగా, టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అర్చకుడు రణధీర్‌ను ఇప్పటికే అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.