ఇరాన్ తో మంచి ఒప్పందం కుదిరితేనే ముందుకు వెళ్తామని ట్రంప్ స్పష్టీకరణ

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమెరికా

ఇరాన్‌తో మంచి ఒప్పందం కుదిరితేనే ముందుకు వెళ్తామని, లేదంటే ఎలాంటి డీల్ ఉండబోదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఐక్యరాజ్యసమితి సమావేశాల నేపథ్యంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల అధినేతలతో జరిగే కీలక భేటీకి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా అంచనాలకు తగ్గట్టుగా ఉంటేనే ఇరాన్‌తో ఒప్పందాలుంటాయని తేల్చిచెప్పారు.