జీకే వీధి జెడ్పీటీసీ టికెట్ కోసం పట్టుబడుతున్న ముక్కలి కళ్యాణి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.కె.వీధి
జీకే వీధి మండల జెడ్పీటీసీ టికెట్ తనకు ఇవ్వాలని జిల్లా టీఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి ముక్కలి కళ్యాణి అధిష్టానాన్ని కోరారు. రెండు వేల పదమూడు నుంచి పార్టీలో క్రియాశీలంగా ఉంటున్నానని తన కుటుంబం మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తోందని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే జెడ్పీటీసీ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.