అమరావతి రాజధాని నిర్మాణానికి 14.365 ఎకరాల భూమి అందజేత
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు రెండో విడత భూసమీకరణ ప్రక్రియ కొనసాగుతుండగా, వైకుంఠపురం గ్రామ పరిధిలోని మాదల కుటుంబం ముందుకు వచ్చింది. మాదల శ్రీనివాసరావు, అప్పారావు, రాంబాబులకు చెందిన మొత్తం 14.365 ఎకరాల భూమిని సీఆర్డీఏకు అందజేసేందుకు అంగీకార పత్రాలను రాయపూడిలోని ప్రధాన కార్యాలయంలో సీఆర్డీఏ అదనపు కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్‌కు అందజేశారు. రాజధాని అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.