వైఎస్ జగన్‌కు దేశంపై ప్రేమ లేదు: టీడీపీ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: రాము స్థలం: ఆంధ్రప్రదేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దేశం పట్ల, సైనికుల పట్ల కనీస గౌరవం లేదని టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగురవేయని జగన్, దేశం కోసం పోరాడిన మాజీ సైనికుడిపై వైసీపీ శ్రేణులు దాడి చేయడాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది.