అందుబాటులోకి ఏఐ ఆధారిత పీజీఆర్‌ఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
ఏఐ ఆధారిత ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికను కొత్తగా అందుబాటులోకి తెచ్చినట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తెలిపారు. దీనివల్ల గ్రీవెన్స్ పరిష్కారం మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ మొబైల్ నుంచే అర్జీ నమోదు చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా ఇప్పటివరకు 23,100 ఫిర్యాదులు నమోదయ్యాయని, 96 శాతం కచ్చితత్వంతో ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవచ్చని వెల్లడించారు.