లా విద్యార్థిని అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యార్థిని చంద్రకళ ఆకస్మిక మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజా జాగృతి సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజలింగు మోతె డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ చంద్రకళ మృతికి అసలు కారణాలు ఇప్పటివరకు స్పష్టంగా తెలియనందున, పోలీసులు అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువ న్యాయ విద్యార్థిని అర్ధాంతరంగా మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.