రెండేళ్లలో లక్ష కొత్త ఉద్యోగాలు వస్తాయి: మంత్రి శ్రీధర్‌బాబు

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో పరిశ్రమల ఏర్పాటుకు ఐటీ సంస్థలు తీవ్ర ఆసక్తి చూపుతున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ ఏడాది 65 జీసీసీలను రాష్ట్రానికి తీసుకొచ్చామని, వీటి ద్వారా రానున్న రెండేళ్లలో లక్ష కొత్త ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. కొత్త జీసీసీ పాలసీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని, డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రూ.70 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడించారు.