అత్యంత పొడవైన టైటిల్‌తో వస్తున్న చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

ప్రముఖ దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే వినూత్న సైకలాజికల్ థ్రిల్లర్ సెప్టెంబర్ 18న విడుదల కానుంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం, సౌండ్ థెరపీ, న్యూరోసైన్స్ నేపథ్యంలో సాగే మిస్టరీ మ్యూజికల్ మూవీ. దివంగత రచయిత మదన్ కథతో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.