కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం: పది వేల కోట్లతో SME గ్రోత్ ఫండ్
రిపోర్టర్: సునీల్
స్థలం: New Delhi
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం పది వేల కోట్ల రూపాయలతో ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అలాగే రవాణా, లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు అంగీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు.